పార్వతీపురం: తల్లిదండ్రులు మందలించారని.. యువకుడి ఆత్మహత్య

57చూసినవారు
పార్వతీపురం: తల్లిదండ్రులు మందలించారని.. యువకుడి ఆత్మహత్య
మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెచ్. సి దేశాబత్తుల రత్నకుమార్ తెలిపిన వివరాలు మేరకు తూడి గ్రామానికి చెందిన కొనిశ శివ(27) తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురై శనివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తు వెల్లడించినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్