మన్యం జిల్లాలో నైపుణ్య గణన 2024ను తప్పులకు ఆస్కారం లేకుండా పక్కాగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నైపుణ్య గణన 2024 పై ఎంపిడిఓలతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 15 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు గల వారి పూర్తి వివరాలను నైపుణ్య గణనలో నమోదు చేయించాలని అన్నారు.