పార్వతీపురం జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కంటైనర్ ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అనార్యోగానికి గురైన వారిని, ప్రసవాల కోసం గర్భిణులను డోలీలో మోసుకుంటూ కొండల నుంచి కిందకు తీసుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తొలుత పైలట్ ప్రాజెక్టుగా సాలూరు మండలం తోణాం పీహెచ్‌సీ పరిధిలోని గిరిశిఖర పంచాయతీ కరడవలసలో కంటైనర్ ఆస్పత్రిని నెలకొల్పారు.