విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో రాణించాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర కోరారు. జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికైన నర్సిపురం గ్రామానికి చెందిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించారు రాష్ట్ర స్థాయిలోనూ సత్తా చాటి పతకాలు సాధించి ఈ ప్రాంత పేరును మరింత ఇనుమడింప చేయాలని సూచించారు.