రాజాంలో పేకాటరాయుళ్ళు అరెస్ట్

53చూసినవారు
రాజాంలో పేకాటరాయుళ్ళు అరెస్ట్
రాజాం మండలం బొద్దాం గ్రామం సమీపంలో దేశవాలి చెరువు గట్టుపై పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను బుధవారం రాజాం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు వారి వద్ద నుండి 32, 970 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్ళు పై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ మేరకు ఎస్ఐ వై. రవికిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్