రేగిడి మండల తహసిల్దార్ గా జే. రాములమ్మ బదిలీపై వస్తున్నట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. ఈమె జేఎల్ పురం తహసిల్దారుగా పనిచేస్తూ బదిలీపై వస్తున్నారు. ఇక్కడ పని చేసిన బి. సుదర్శనరావు విజయనగరం జిల్లా దత్త రాజేరు మండల తహసిల్దార్ గా బదిలీపై వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీలు చేపడుతున్నారు. మరో రెండు రోజుల్లో తహసిల్దార్ గా రాములమ్మ బాధ్యతలు చేపట్టనున్నారు.