రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె 14వ రోజుకు చేరుకుంది. పార్వతిపురం మన్యం జిల్లా అంగన్వాడీల జిల్లా ఉప కార్యదర్శి బలగ రాధ, సిఐటియు జిల్లా ఉప కార్యదర్శి ఎన్ వై నాయుడుల ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడి కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల యూనియన్ అధ్యక్షురాలు బలగ రాధ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు, న్యాయమైన హక్కులు తీర్చాలన్నారు.