కార్మిక హక్కులు కాపాడడంలో సిఐటియు ముందు నిలుస్తుంది

69చూసినవారు
కార్మిక హక్కులు కాపాడడంలో సిఐటియు ముందు నిలుస్తుంది
దేశంలో కార్మిక హక్కులు కాపాడడంలో సిఐటియు ముందు వరుసలో నిలుస్తుందని సిఐటియు మన్యం జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు తెలిపారు. 54 వఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు నాయకులు పి రాముడు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు సీనియర్ సభ్యుడు తుపాకుల లక్ష్మణ్ సిఐటియు జెండాను ఆవిష్కరించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు, పలు రంగంలో ఉన్న లక్షల మంది ఉద్యోగులు కార్మిక హక్కులు కాపాడడంలో సిఐటియు అండగా ఉంటుందని తెలిపారు.