విధుల నుంచి అంగన్వాడీ కార్యకర్త తొలగింపు

77చూసినవారు
విధుల నుంచి అంగన్వాడీ కార్యకర్త తొలగింపు
సాలూరు పట్టణం రామా కాలనీ సెంటర్ 3లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త బలగ రాధను బుధవారం విధుల నుండి తొలగిస్తున్నట్లు ఇంచార్జి పీఓ విజయలక్ష్మి తెలిపారు. తన విధులు సక్రమంగా నిర్వహించక పోవడంతో పాటు పలు ఆరోపణలు ఉండడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టిన పిదప 8 మెమొలతో పాటు రెండు చార్జ్ మెమోలు అందజేశామని అన్నారు. తదుపరి అధికారుల నిర్ణయం మేరకు ఆమెను విధుల నుండి తొలగిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్