సామూహిక బీజామృతంతో వరి విత్తన శుద్ధి

163చూసినవారు
సామూహిక బీజామృతంతో వరి విత్తన శుద్ధి
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో శుక్రవారం వరి విత్తనాలను ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సామూహికంగా బీజామృతంతో శుద్ధి చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సీఆర్పీ ఉర్లక నాగార్జున మాట్లాడుతూ.. బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేసుకోవడం వల్ల మొలక శాతం పెరుగుతుందని, గింజలు నుండి వచ్చే తెగులును, భూమి నుండి సంక్రమించే తెగులును, వాతావరణంలో ఉండే తెగులు నుండి నివారిస్తుందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్