పొలానికి నీరు మళ్లించే విషయంలో ఓ వ్యక్తిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. పాచిపెంట ఎస్సై వెంకటసురేష్ వివరాల మేరకు. కూనం బంద పరిధిలో ఎం. కోటేశ్వరరెడ్డి పొలానికి ఆనుకుని పాంచాలికి చెందిన బంగార్రాజు కుటుంబ సభ్యులకు భూమి ఉంది. ఇద్దరి మధ్య గతంలో తగాదాలున్నాయి. మంగళ వారం నీటి మళ్లింపు విషయంలో తనపై బంగార్రాజు కుటుంబ సభ్యులు కర్రలు, రాళ్లతో దాడి చేశారని కోటేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.