సాలూరు నియోజకవర్గం మక్కువ శ్రీ ఉమాశాంతేశ్వర ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నారాయణ ఆధ్వర్యంలో మక్కువ, శాంతేశ్వరం, కోన బంగారువలస తదితర గ్రామాల నుంచి ఉదయం వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి పూజలు, పాలాభిషేకాలు, మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.