కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. సాలూరు మండలంలోని మామిడిపల్లిలో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహిస్తున్న ప్రజాపోరులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, విద్యుత్ ధరలు సామాన్యుడు మోయలేని భారం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.