ఎస్ కోట మండలంలో ఉదయం 8 గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. మండలంలో సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. దట్టమైన మంచు కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంటోంది. రోడ్డు మార్గం సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు తమ వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. కాగా ఇటీవల వర్షాలు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మినుము, పెసర పంటలకు మరింత నష్టం వాటిల్లితుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.