టిడిపి గెలుపుతో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి

55చూసినవారు
టిడిపి గెలుపుతో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని ఎస్ కోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట మండలం మళ్లివీడులో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిడిపి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలను ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆమె పలు దుకాణాల వద్ద స్వయంగా వంటకాలు నిర్వహిస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. తనను ఎమ్మెల్యేగా, భరత్ ను ఎంపీగా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్