మహాకవి గురజాడ 162వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గురజాడ స్వగృహంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జయంతి కార్యక్రమాలను ప్రారంభించారు. గురజాడ కుటుంబ సభ్యులు ప్రసాద్, ఇందిరలతో కలిసి గురజాడ స్వగృహంలో ఆయన విగ్రహానికి పూలమాలలువేసి, నివాళులర్పించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ పి. సురేష్‌బాబు, జిల్లా కలెక్టర్ బి. ఆర్. అంబేద్కర్, జెసి ఎస్. సేతు మాధవన్, తదితరులు పాల్గొన్నారు.