బుధవారం స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాల, ఎన్. సి. సి ఆఫీసర్ లెఫ్ట్నెంట్ ఎం. వరలక్ష్మీని రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం వారు బ్లడ్ డోనర్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ చైర్మన్ సన్మానించారు. ఆమె చేసిన సేవలకు గాను ప్రశంసా పత్రంతో అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు మాట్లాడుతూ, కళాశాల ఎన్. సి. సి బృందం అన్ని సామాజిక సేవలలోను మరియు తరచుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించటం వలన ఇటువంటి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఎన్. సి. సి ఆఫీసర్ లెఫ్టినెంట్ వరలక్ష్మీని అభినందించారు. ఈ సందర్బంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ శ్రీమతి సి. హెచ్. వెంకటలక్ష్మి, గ్రంధాలయ అధికారిణి డా. లెంక సత్యవతి, కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అభినందనలు తెలియజేశారు.