పిఠాపురానికి చెందిన బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం అఘాయిత్యం జరిగిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అమానుష చర్యను సభ్య సమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బాధితురాలిని ఆదుకోవడంతో పాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తానని హామీ ఇచ్చారు.