ఏపీలో ఈ నెల 14 నుంచి 'పల్లె పండుగ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని పేర్కొన్నారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను 'పల్లె పండుగ' సందర్భంగా ప్రారంభించాలని అధికారులకు చెప్పారు. 300 కి.మీ మేర సీసీ రోడ్లు, 500 కి.మీ మేర తారు రోడ్లు వేయాలని అధికారులను ఆయన మంగళవారం ఆదేశించారు.