నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: మెహబూబా ముఫ్తీ

59చూసినవారు
నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: మెహబూబా ముఫ్తీ
జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లోనే పీడీపీ ప్రభావం చూపింది. దీంతో ఎన్నికల ఫలితాల సరళిపై మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆమె వెల్లడించారు. "జమ్మూకశ్మీర్‌ ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. మనకు బలమైన ప్రభుత్వం అవసరం. ప్రజలు స్థిరమైన ప్రభుత్వానికి ఓటు వేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను." అని మెహబూబా ముఫ్తీ అన్నారు.

సంబంధిత పోస్ట్