తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ప్రొటోకాల్ ప్రముఖలు మినహా.. సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, ఈనెల 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు.