త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్‌

52చూసినవారు
త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్‌
ప్రైవేటు రంగానికి చెందిన అతి పెద్ద బ్యాంకు ఐసీఐసీఐ లాభం రూ.11,746 కోట్లుగా నమోదైంది. ఈ మేరకు తాజాగా ఆ బ్యాంకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో బ్యాంక్‌ లాభం రూ.11,746 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.47,714 కోట్లకు చేరినట్లు బ్యాంక్‌ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్