బుధవారం పద్మనాభం, లింగన్నపేట గ్రామంలో వైస్సార్ సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పార్టీ అధ్యక్షులు కోరాడ లక్ష్మణరావు ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ, ప్రభుత్వ పథకాలు గురించి వివరిస్తూ శాసన సభ్యులుగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, పార్లమెంట్ సభ్యులుగా బోత్స ఝాన్సీ లక్ష్మి ను అఖండ మేజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిన్నింటి సూర్యనారాయణ పాల్గొన్నారు.