విశాఖలోని వాల్తేర్ డిపో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టినప్పటికీ అధికారులు స్పందించక పోవటంపై సర్వత్రా నిరసనలు వ్యక్త మవుతున్నాయి. డిపోలో నెలకొన్న సమస్యలు, మహిళలు పడుతున్న ఇబ్బందులపై ఉద్యోగ, కార్మికులు చేస్తున్న దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. దీక్షను జిల్లా కార్యదర్శి నీలకంఠం ప్రారంభించారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.