కేజీహెచ్ లో ఖాళీగా ఉన్న డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ పోస్టులను భర్తీ చేసేందుకు వైద్య విద్యా సంచాలకులు ఆదేశాలు జారీ చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద బుధవారం తెలిపారు. వీటికి అర్హులైన ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ పోస్టులకు ఈనెల 5వ తేదీ(గురువారం) లోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.