బుచ్చయ్యపేట మండలంలో తెదేపా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక తాసిల్దార్ కార్యాలయం దగ్గర ముఖ్యఅతిథిగా చోడవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ బత్తుల తాతయ్య బాబు పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం డీలర్ వ్యవస్థను పూర్తిగా తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదని ఎంతోమంది రోడ్డున పడతారని ఈ ఆలోచన విరమించుకోవాలని ఈ ముఖ్యమంత్రి కి తెలియపరుస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు గోకాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, ఎం వివి సత్యనారాయణ, కోట సత్యనారాయణ, బుచ్చి పేట సర్పంచ్ సూరిబాబు సీతయ్యపేట, సర్పంచ్ శ్రీను, కొండ పాలెం సర్పంచ్ ఎం తాతయ్యలు తేదేపా కార్యకర్తలు పాల్గొని నిరసన తెలియజేశారు.