అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన పడాల రామారావు భారతదేశ ఆర్మీలో 28 సంవత్సరాల పాటు సేవలందించి రిటైర్మెంట్ అయ్యారు. వైజాగ్ లో ఉన్న ఆర్మీ క్యాంటీన్ లో సామాన్లు కొనుక్కొని అటు నుంచి బయలుదేరుతుండగా మార్గ మధ్యలో అనకాపల్లి జలగల మధు దగ్గర తను మోటార్ సైకిల్ మీద వస్తుండగా వెనక నుండి వచ్చిన లారీ ఢీకొంది. గాయాలు కావడం వలన స్థానికులు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. హాస్పిటల్ దగ్గరికి రాగానే మృతి చెందారని డాక్టర్లు గురువారం తెలిపారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీస్ వారు భార్య రత్నకుమారి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా కేసు నమోదు చేశారు.