అనకాపల్లి జిల్లా బుచ్చయ్య పేట మండలం ఆర్ భీమవరం గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మాట్లాడుతూ.. రామారావు పేదల కోసం కూడు గూడు అనే నినాదంతో కిలో బియ్యం రెండు రూపాయలకే పెన్షన్ పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి అని చెప్పారు. అలాంటి వ్యక్తి శత జయంతి ఉత్సవాలు ఆర్ భీమవరంలో నిర్వహించడం గొప్ప విషయం అని గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల తాతయ్య, బాబు గోకాడ కోటేశ్వరరావు, మలిరెడ్డి బాబ్జి, డొంకిన అప్పలనాయుడు, దాసరి సత్యనారాయణ, కోట సత్యనారాయణ, కోరుకొండ రవికుమా,ర్ వియ్యపు అప్పారావు, కంచిపాటి శ్రీను రాజారావు, తాతాజీ, సతీష్, గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.