నీలవరంలో త్రాగునీటికి కటకట

1137చూసినవారు
విశాఖ ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లోని త్రాగునీటికి గిరిజనులు నేటికీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొయ్యూరు మండలం యు. చీడిపాలెం పంచాయితీ మారుమూల నీలవరం గ్రామస్తులు గత ఏడాది కాలంగా త్రాగునీటి అవసరాలకై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి త్రాగునీటి సౌకర్య కల్పనకై గత ఏడాది గ్రావిటీ పథకం మంజూరైన నేటికీ పనులు పూర్తి కాకపోవడంతో అక్కడ గిరిజనులకు తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామస్తులంతా ఏకమై రాళ్ల మధ్య నుండి వచ్చే ఊటనీటిని త్రాగు నీటి అవసరాలకు గ్రామానికి మళ్ళించుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కరించాలని నీలవరం వాసులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్