హామీల అమలుకు 17న ఏపీ రైతు సంఘం ధర్నా

79చూసినవారు
హామీల అమలుకు 17న ఏపీ రైతు సంఘం ధర్నా
AP: ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17న విజయవాడలోని ధర్నా చౌక్‌లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎపి రైతు సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతేడాది ఎన్నికల సందర్భంగా రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామన్న హామీ ఏడాది గడుస్తున్నా హామీగానే మిగిలిపోయిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్