యువత ప్రోద్భలంతో సామాజికంగా, సాంస్కృతికంగా సాధికరత సాధించి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో ఆదివారం ఈ మేరకు ప్రధాని మోడీ మాట్లాడారు. ‘దేశ యువత సామర్థ్యాలు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలుపుతాయి. అభివృద్ధి చెందిన భారత్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా సాధికరత పొందుతుంది.’ అని మోదీ అన్నారు.