అరకు ఎంపీ మాధవి సమక్షంలో సంక్రాంతి సంబరాలు

674చూసినవారు
కొయ్యూరు మండలం వెలగల పాలెం గ్రామంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పాల్గొని ముగ్గుల పోటీలను స్వయంగా పర్యవేక్షించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం విజేతలకు భర్త శివ ప్రసాద్, వైసీపీ యువనేత మహేష్, స్థానిక సర్పంచ్ లతో కలిసి బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్