ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం

1083చూసినవారు
ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎం. మాకవరం సర్పంచ్ కోడా చింతల్లి, ఎంపీటీసీ పొడుగు రత్నం అన్నారు. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని మరో మూడు నెలల పాటు ప్రభుత్వ పొడిగించడం తో విశాఖ మన్యంలో ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కొయ్యూరు మండలం ఎం.మాకవరం డిఆర్ డిపోలో డిసెంబర్ జనవరి నెలలకు సంబంధించి రెండు నెలల ఉచిత రేషన్ బియ్యాన్ని సర్పంచ్ చింతల్లి, ఎంపీటీసీ రత్నంలు స్థానిక నేతలతో కలిసి శుక్రవారం ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందజేస్తోంది అన్నారు. ఉచిత రేషన్ బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులంతా వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్