పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వరద బాధితుల కోసం ఐదు వేల బిస్కెట్ ప్యాకెట్స్ తో పాటు పదివేల మంచి నీటి బాటిల్స్ విజయవాడ వరద బాధితుల కోసం తీసుకెళ్లినట్లు అనకాపల్లి జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో వరద బాధితులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొప్పిశెట్టి బుజ్జి పాల్గొన్నారు.