విశాఖజిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అడపా సూర్యారావు లాక్ డౌన్ కారణంగా ఇళ్ళకు పరిమితమైన ప్రజలకు తనవంతు సాయమందించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా గురువారం కాగిత గ్రామంలో సామాజికదూరం పాటిస్తూ ప్రతి ఇంటికి 4 రకాల నిత్యావసర వస్తువులు వితరణ గావించారు. ఈ సందర్భంగా అడపా సూర్యారావు మాట్లాడుతూ....ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా సతమతమవుచున్న ప్రజలకు ఉడుతాభక్తిగా ఇంటింటికీ ఒక్కో కిలో చొప్పున పంచదార, ఉప్మారవ్వ, అరకిలో సేమియా, కాబోలి సనగలు తనవంతు వితరణగా అందించానన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయంపూడి తాజా మాజీ సర్పంచ్ ఆకేటి గోవిందరావు, కాగిత మాజీ ఎంపిటి సి దేవవరపు వరలక్ష్మి, అడపా శివ కుమార్, గంగాధర్, రామారావు, రమణ, దేవవరపు రాజు, గుండి బిల్లి గోవింద్, ఆకేటి సత్యనారాయణ, చెవేటి తలుపులు, ఎస్.కె మీరా, పామయ్య, నరసయ్య, అనపర్తి పాండు, చంద్రరావు, నాగనబోయిన కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.