UPలోని ఓ పాఠశాల డైరెక్టర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. నవనీష్ సహాయ్ అనే వ్యక్తి నొయిడాలో ప్లే స్కూల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈనెల 10న ఓ టీచర్ బాత్రూంలోని బల్బ్ హోల్డర్‌లో కెమెరా ఉన్న విషయాన్ని గమనించారు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు దీన్ని ఖండించారు. చర్యల్లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ డైరెక్టరే ఈ అకృత్యానికి పాల్పడినట్లు తెలిసింది. అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.