అనకాపల్లి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు జాతీయ రహదారి పైన మంగళవారం ఉదయం భారీ కంటైనర్ బోల్తా పడింది. దింతో డ్రైవర్ కు చేయి విరిగి తీవ్ర గాయాలు కాగా 108లో స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సంఘటన స్థలానికి అనకాపల్లి జిల్లా ట్రాఫిక్ పోలీస్ అధికారులు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.