చేతి వృత్తుల వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. కసింకోటలో ఆదివారం నిర్వహించిన కుమ్మరి శాలివాహన కమ్యూనిటీ ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాలివాహన సంఘానికి భవన నిర్మాణం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమస్యలు ఏమైనా ఉంటే తనకు నేరుగా తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.