ముంపునకు గురైన పంట పొలాలు పరిశీలన

69చూసినవారు
ముంపునకు గురైన పంట పొలాలు పరిశీలన
నర్సీపట్నం వ్యవసాయ శాఖ ఏడి శ్రీదేవి సోమవారం గొలుగొండ మండలంలో పర్యటించారు. రావణాపల్లి, పాకలపాడు, చీడిగుమ్మల, కొత్తమల్లంపేట, లింగంపేట గ్రామాల్లో వర్షాల కారణంగా నీటి ముంపునకు గురైన వరి పంటలను పరిశీలించారు. నీటిని కాలువలు ద్వారా బయటకు పంపే మార్గం చేయాలని రైతులకు సూచించారు. పూర్తిగా నీటితో నిండిన వరి పైరుకు 20 కేజీల యూరియా, 5 కేజీల పొటాష్ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ వ్యవసాయాధికారి సుధారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్