అనంతగిరి: గుమ్మకోట పంచాయతీ భీమవరం గ్రామంలో ప్రజల ఫిర్యాదు మేరకు మంగళవారం రెవెన్యూ, సచివాలయం అధికారులు కలిసి గ్రామకంఠం సరిహద్దులో గల పాఠశాల భవనం, దేవాలయం, అంగన్వాడి భవనం, డిఆర్ డిపో, ఆరోగ్య కేంద్రం, వాటర్ ట్యాంక్, ఇతర భూములును గ్రామ ప్రజల సమక్షంలో సర్వే నిర్వహించారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయిల్లో గ్రామకంఠం భూముల సర్వే నివేదికను అందిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.