అరకులోయ మండలంలోని చొంపి సచివాలయం వద్ద శుక్రవారం సర్పంచ్ జీనాబంధు ఆధ్వర్యంలో పెసా కమిటీ ఎన్నిక జరిగింది. పెసా పంచాయతీ అధ్యక్షుడిగా జల్లెడి నూతన ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కార్యదర్శిగా పద్మానాయుడు దశరథ్ ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడు నూతన ప్రసాద్ మాట్లాడుతూ ఆదివాసీల అటవీ హక్కుల చట్టాల కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. ఆదివాసీల హక్కులను చట్టాలను ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని కోరారు.