ఆనందపురం మండలంలో గిడిజాల పంచాయతీలోని సాయి గణపతి ఇంజినీరింగ్ కళాశాల క్యాంటీన్‌లో విద్యార్థులు బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. పరిశుభ్రత లేని కారణంగా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉందన్నారు. అహారంలో నాణ్యత లోపాలున్నాయని, తాగే నీళ్లలో క్రిములు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని చాలాసార్లు కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రిన్సిపాల్ మహేష్ కుమార్ వారానికి ఒక్కసారి తనిఖీ చేస్తానన్నారు.