భీమిలిలో ఓ మైనర్ బాలుడు 16ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాలుడు గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. ఈ తరుణంలోనే బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుండి పరారైయ్యాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.