వైఎస్ఆర్ సిపి "మునిగిన నావ" అని, త్వరలోనే చరిత్ర పుటల్లో కలిసిపోతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వైఎస్ఆర్సిపి అనే పార్టీ ఉండిందని, అధికారంలోకి వచ్చి తర్వాత అంతర్ధానమైపోయిందని ఆయన అన్నారు. శుక్రవారం మధురవాడ జోనల్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ, ఈ పార్టీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని తెలిపారు.