సీఎం చంద్రబాబు విశాఖలోని రుషికొండ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాత్ టబ్‌కు రూ.36 లక్షలు, కమోడ్‌కు రూ.12 లక్షలు వెచ్చించడం దారుణమని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ ప్యాలెస్‌కు రూ.450 కోట్ల ఖర్చు చేశారని తెలిపారు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ దుర్మార్గంపై ఆ పార్టీ నేతలంతా సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.