భీమిలి ఉత్సవ్‌ను డిసెంబర్ ఒకటవ తేదీన ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి ఎంపీడీవో కార్యాలయంలో కోలాటం పోటీల విజేతలకు ఆదివారం ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా భీమిలి ఉత్సవ్ జరిపిస్తామన్నారు. కళాకారులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తామన్నారు.