పోడవరం మండలం డి. బుచ్చయ్యపేట గ్రామంలో బుధవారం నిర్వహించిన పలు రకాల పోటీలు స్థానికులను అలరింపజేశాయి. శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ ప్రజా గ్రంథాలయం కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు సహాయ సహకారంతో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్, డక్ ఫైట్ (బాతుల పోటీ) వంటి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కే. గౌరీ శంకర్ మాస్టారు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. గ్రంథాలయ కమిటీ కన్వీనర్ ఎన్ భాస్కర్, గ్రంథాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.