అధ్వానంగా ఉన్న బియన్ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపడుతామని చోడవరం శాసనసభ్యులు కె ఎస్ యన్ ఎస్ రాజు అన్నారు. మంగళవారం ఆయన చోడవరం నియోజకవర్గం రోలుగుంట రావికమతం మండలాల్లోనూ పర్యటించి ఎక్కడెక్కడ రోడ్లు అద్వానంగా ఉన్నాయో రోడ్డు కాంట్రాక్టర్, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బి. ఎన్ రోడ్డు అద్వాన్నంగా ఉండడం వల్ల పలుమార్లు వాహనచోధకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.