జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా డోలా బాలవీరాంజనేయ స్వామి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కొల్లు రవీంద్రలను ప్రభుత్వం నియమించింది. హోం మంత్రి అనితను విజయనగరం జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా నియమించారు.