ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 24వ తేదీ ఉదయం 10. 30 గంటలకు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగే సమావేశానికి ప్రజా ప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యులు హాజరై ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై చర్చిస్తారన్నారు. సభ్యులంతా తప్పక హాజరుకావాలని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర బుధవారం కోరారు.